ఓటు చోరీపై రేవంత్ రెడ్డి నిప్పులు: కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓటు చోరీ వ్యతిరేక నిరసనకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక రైళ్లను రద్దు చేసినా శ్రేణులు వెనక్ కి తగ్గలేదన్నారు. దేశవ్యాప్తంగా పేదల ఓట్లను తొలగించారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు ఈ ధర్మపోరాటం ఆగదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.