వర్జీనియాలో వైభవంగా క్యాట్స్ ఆధ్వర్యంలో దసరా దీపావళి వేడుకలు
రిపోర్టర్: హరి
స్థలం: USA
అమెరికాలోని వర్జీనియాలో రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 1న దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆల్డీ/యాష్‌బర్న్ ప్రాంతంలోని హైస్కూల్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన ఆహారంతో కుటుంబ సమేతంగా పాల్గొనాలని నిర్వాహకులు తెలుగు ప్రజలను ఆహ్వానించారు.