పోలీసుల వేగవంతమైన స్పందనతో పోగొట్టుకున్న విలువైన వస్తువులు లభ్యం
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అత్యవసర సమయాల్లో వేగవంతమైన సేవలు అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుడు పోగొట్టుకున్న రెండు బ్యాగులు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక బ్యాటరీ బ్యాకప్‌ను పోలీసులు లొకేషన్ ఆధారంగా రైల్వే కోడూరు సమీపంలో గుర్తించి భద్రంగా స్వాధీనం చేసుకున్నారు. విలువైన వస్తువులు పోయినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసు శాఖ ప్రజలకు సూచించింది.