సంగం ఐటీఐ కళాశాల అభివృద్ధికి ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ సాయం
రిపోర్టర్: హరి
స్థలం: సంగం
సంగం ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనాన్ని ఐదు కోట్ల పందొమ్మిది లక్షల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చిందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఈ విరాళం లభించిందని, తరుణవాయి గ్రామంలో ల్యాంకో కంపెనీ భవనాలను ప్రతినిధులు పరిశీలించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.