వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు: ఫౌంటెన్ ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్

రిపోర్టర్: సునీల్ స్థలం: రాజన్న సిరిసిల్ల

వేములవాడ పట్టణంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మహిళలు అధికారులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారని కలెక్టర్ రాజన్న సిరిసిల్ల వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫౌంటెన్ను ఆయన అధికారికంగా ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక మహిళలు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారని తెలిపారు.