వాతావరణ మార్పుల ప్రభావంతో ఏపీలో భారీగా తగ్గిన వరి సాగు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
వాతావరణ మార్పులు మరియు సూపర్ ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 1.90 లక్షల హెక్టార్ల మేర సాగు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం కారణంగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులతో అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని, వెంటనే ప్రత్యేక కరవు ప్యాకేజీ ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.