ప్రివిలేజ్ ఫీజుపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత: యజమానులకు ఎలాంటి భారం ఉండదు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రివిలేజ్ ఫీజు వల్ల బార్ యజమానులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల కేవలం వినియోగదారులపై మాత్రమే స్వల్ప ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా మద్యం రాబడి గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడించారు.