గుంటూరులో రూ.147.36 కోట్లతో గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
గుంటూరు నగరంలో రద్దీ నియంత్రణే లక్ష్యంగా రూ.147.36 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఎల్సీ-3) నిర్మాణ పనులకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శంకుస్థాపన చేసినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. రైల్వే శాఖ మరియు జలశక్తి శాఖల కేంద్ర సహాయ మంత్రి వి. సోమన్న ముఖ్య అతిథిగా హాజరై ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో ప్రజల రాకపోకలు సులభతరమై ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.