వైకాపాపై నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ధ్వజం: తెదేపాలో చేరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: Visakhapatnam

వైకాపా ఒక కార్పొరేట్ కంపెనీ వంటిదని, అక్కడ ఎలాంటి విలువలు ఉండవని ఆ పార్టీ నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు విమర్శించారు. జగన్ ఒంటెత్తు పోకడల వల్లే వైకాపా పతనం అయిందని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై తిరిగి పార్టీలోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.