ది ప్యారడైజ్ సినిమాలో శంకరన్న పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ది ప్యారడైజ్ చిత్రంలో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో పార్టీ నేతలతో కలిసి ఆయన ఈ సినిమాను వీక్షించారు. కేసీఆర్ను పోలిన ఆ పాత్ర కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని దర్శకుడు చక్కగా చూపించారని ఆయన ప్రశంసించారు.