అన్నపూర్ణాదేవి అవతారంలో దుర్గామాత దర్శనం: బెల్లంపల్లిలో ఘనంగా పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని మూడో వార్డు రవీంద్రనగర్లో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు మంగళవారం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వార్డు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.