పెద్దపల్లిలో యువ టూరిజం పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం
రిపోర్టర్: సునీల్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవం రెండు వేల ఇరవై ఆరు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన యువ టూరిజం జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఘనంగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.