మొరాదాబాద్‌లో బోల్తా పడిన లారీ రోడ్డుపై నేతి ప్రవాహం
రిపోర్టర్: శివ
స్థలం: మొరాదాబాద్
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో హర్యానా నుండి రుద్రపూర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న నెయ్యి లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున నెయ్యి రోడ్డుపై పారింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, రోడ్డుపై పడిన నెయ్యిని సేకరించేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్యాకెట్లు, కంటైనర్లలో నెయ్యిని ఇష్టానుసారంగా పోగు చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమికూడిన జనాలను చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.