రేవంత్ కేసీఆర్ ఇద్దరూ నయా నిజాంలే అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపాటు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ నిజాం వారసుల్లాగే మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇద్దరూ నిజాంను పొగిడారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని, ఎంఐఎం బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయా నిజాంలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.