కడపలో దాల్మియా సిమెంట్స్ భారీ విస్తరణకు భూ కేటాయింపులు
రిపోర్టర్: సతీష్
స్థలం: కడప
కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మర్ల పరిధిలో దాల్మియా సిమెంట్స్ భారీ విస్తరణ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రెండువందల యాభై ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో వేయి మంది యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, సంస్థ ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది మిలియన్ టన్నులకు పైగా పెరగనుందని అధికారులు తెలిపారు.