ఉపాధి శ్రామికులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మీయ భోజనం

రిపోర్టర్: హరి స్థలం: పశ్చిమ గోదావరి

పల్లె ప్రగతికి చెమటోడ్చే ఉపాధి హామీ శ్రామికుల శ్రమకు గౌరవం ఇవ్వడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు యలమంచిలి మండలం పెదలంక గ్రామంలో ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ భోజనాల కార్యక్రమంలో శ్రామిక మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించినట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా శ్రామికులతో మమేకమై వారి కష్టసుఖాలను పంచుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.