ఆసియా క్రీడల్లో సెమీస్‌లో ఒడిపోయిన క్యూన్సీ డిసౌజా

రిపోర్టర్: రమేష్ స్థలం: World

ఆసియా క్రీడలు 2026 టెక్‌బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ పోరులో భారత క్రీడాకారిణి క్యూన్సీ జోవాకిమ్ డిసౌజా ఇండోనేషియా ఆటగాడు ఇమా సుమాయ చేతిలో పరాజయం పాలైంది. ఐచీ-నగోయా వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో క్యూన్సీ మొదటి సెట్ గెలుచుకున్నప్పటికీ, తర్వాతి సెట్లలో వెనుకబడి ఫైనల్స్ చేజార్చుకుంది. అయితే ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో ఆమె జపాన్ క్రీడాకారిణి యునా సకామోటోతో తలపడనుంది.