రామాపురంలో పల్లెపండగ మూడు సున్నా అభివృద్ధి పనులను ప్రారంభించిన చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లెపండగ మూడు సున్నా కింద పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి పనులపై లఘుచిత్రం ప్రదర్శించారు. డెబ్బై ఏళ్లుగా రోడ్లకు నోచుకోని గ్రామాల్లో ప్రగతి సాధించామని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.