దిశావల్లీ షాపింగ్ వేళ ర్యాలీ: రూ. పదివేల కోట్ల నష్టంపై వ్యాపారుల ఆవేదన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

రామ్ లీలా మైదాన్ లో నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీ కారణంగా దీపావళి షాపింగ్ సమయంలో సుమారు రెండున్నర లక్షల దుకాణాలు మూతపడ్డాయని, దీనివల్ల వ్యాపారులకు పది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ వల్ల వ్యాపారం పూర్తిగా నిలిచిపోయిందని, ఈ భారీ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు.