ఆస్కార్ రేసులో ఇళయరాజా సంగీతం అందించిన గొంధల్ సినిమా

రిపోర్టర్: మహేష్ స్థలం: India

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించిన మరాఠీ మానసిక థ్రిల్లర్ సినిమా గొంధల్ 99వ అకాడమీ అవార్డుల పోటీలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. సంతోష్ దవఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇళయరాజా తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ ఈ అరుదైన గౌరవం దక్కడం గమనించదగ్గ విషయం.