తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 15 నుండి 23 వరకు సాలకట్ల, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట భద్రత, వసతి, తాగునీరు మరియు అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.