కోల్కతా తొక్కిసలాట విషాదం: అమిత్ షా పర్యటనలు రద్దు

రిపోర్టర్: అశోక్ స్థలం: కొల్‌కతా

కోల్కతాలోని చోర్బాగన్ పూజా పండల్ వద్ద జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ హృదయ విదారక దుర్ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషాదం నేపథ్యంలో ఆదివారం తాను పశ్చిమ బెంగాల్లో పాల్గొనాల్సిన అన్ని అధికారిక, రాజకీయ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు అమిత్ షా ప్రకటించారు. సోమవారం నేరుగా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు వెల్లడించారు.