వైద్య రంగంలో అరుదైన మైలురాయి: ముప్ పై ఆరేళ్ల యువకుడికి రోబోటిక్ శస్త్రచికిత్స
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
ముప్ పై ఆరేళ్ల యువకుడికి వైద్యులు రోబోటిక్ ద్వారా అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు నిపుణులు వెల్లడించారు. తీవ్రమైన మైత్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి పరీక్షలు నిర్వహించగా, ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె ధమనులలో మూడు తీవ్రమైన బ్లాక్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎముక కోత లేకుండా అత్యాధునిక రోబోటిక్ పరిజ్ఞానంతో ఒకే శస్త్రచికిత్సలో వాల్వ్ మార్పిడితో పాటు బైపాస్ ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు వైద్య బృందం స్పష్టం చేసింది.