సెక్యూరిటీ గార్డుల పొట్ట కొడుతున్న సింగరేణి యాజమాన్యం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మందమర్రి సింగరేణి ఎస్ అండ్ పిసి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై అధికారులు వివక్ష చూపుతున్నారని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం గౌరవధ్యక్షులు సంకె రవి, కార్యదర్శి దూలం శ్రీనివాస్ ఆరోపించారు. గత పన్నెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న యాభై మంది కార్మికులను గత నాలుగు నెలలుగా డ్యూటీలకు తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడ్డారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.