పోలీసుల లాఠీఛార్జ్కు నిరసనగా ఆదిలాబాద్లో బంద్కు పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Adilabad

ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర సందర్భంగా బ్యాండ్ మేళా కళాకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని హిందూ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తూ నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్కు ఉత్సవ నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ప్రధాన రహదారిపై వందలాది వినాయక విగ్రహాలతో భక్తులు బైఠాయించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.