మృత్యువు కళ్లలో దాగున్న బావిలో దొరికిన కుళ్లిపోయిన శవం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెమడుగు గ్రామపంచాయతీ అజీజ్ క్రషర్ సమీపంలోని బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. పోలీసుల సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోకి దిగి మృతదేహాన్ని వెలికితీసి అంబులెన్స్లో ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.