వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ రాజీనామా

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ రాజీనామా చేశారు. ఇటీవల పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో డాక్టర్ భరత్ను ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా నియమించారు.