పోషణ మాస ఉత్సవాల్లో తల్లీబిడ్డల ఆరోగ్య అవగాహన
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సేవలు అందించిన కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి, ఫౌండేషన్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.