ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతారు: కేసీఆర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ మళ్లీ సభలోకి వస్తే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా కేసీఆర్ సభకు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నా, అధికార పక్షం అవమానించేందుకే ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.