కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందంటూ బీఆర్ఎస్ విమర్శ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం దండగగా మారిందని భారత్ రాష్ట్ర సమితి ఆరోపించింది. రైతులకు అన్ని వైపుల నుంచి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని మండిపడింది. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని, రైతుబంధు నిధులు జమ కావడం లేదని, రైతుబీమా కూడా అందడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేసింది.