నీట్ స్థానికత నిబంధనపై సుప్రీంకోర్టులో విద్యార్థిని పిటిషన్ తిరస్కరణ

రిపోర్టర్: నరేష్ స్థలం: దిల్లీ

నీట్ కౌన్సిలింగ్లో తనకు ఆంధ్రప్రదేశ్లో స్థానికత వర్తింపజేయాలని కోరుతూ గుండుబోగుల యజ్ఞ శ్రీశ్రావ్య దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి నిరాకరించినట్లు న్యాయవాదులు తెలిపారు. నీట్ రాయడానికి ముందు వరుసగా నాలుగేళ్లు స్వరాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన ఉన్నందున, గతంలో ఇచ్చిన మినహాయింపును వర్తింపజేయాలని విద్యార్థిని కోరగా కోర్టు అంగీకరించలేదు.