నార్సింగి మణికొండలో అధికారుల నిర్లక్ష్యంతో పునరుద్ధరిస్తున్న అక్రమ నిర్మాణాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలు మళ్లీ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో అధికారులు కూల్చివేసిన భవనాలను యజమానులు తిరిగి నిర్మించుకుంటున్నా పట్టించుకోవడం లేదని, కోకాపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున హాస్టల్స్ వెలుస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.