మహిళా జర్నలిస్ట్ వేధింపుల ఆరోపణలు: ఏసీపీ వివేక్ భగత్ పదోన్నతి నిలిపివేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ కన్నాట్ ప్లేస్ ఏసీపీ వివేక్ భగత్ పదోన్నతిని నిలిపివేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన కవర్ చేస్తున్న సమయంలో ఆయన తనను అసభ్యంగా తాకినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు కొత్త బాధ్యతలు చేపట్టనని ఆ అధికారి కోరడంతో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.