కంఠారం పాఠశాలలో నూతన ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కంఠారం ఎంపీపీ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసీ చైర్మన్ కొండేటి బంగారురాజు, వైస్ చైర్మన్ బచ్చలి మీనాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గాడి శ్రీరామమూర్తి, పెల్ల అప్పల నాయుడు, గాడి భాస్కర్, చింతల రమణ, బొడ్డు ఎరికినాయుడు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.