కైలాసపురంలో నేడు జనసైనికుల విస్తృతస్థాయి సమావేశం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని కైలాసపురం సాగరమాల కన్వెన్షన్ సెంటర్ వద్ద శనివారం ఉదయం 10:00 గంటలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు, వీర మహిళల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.