హుస్నాబాద్లో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ పట్టణంలోని 16వ వార్డులో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.