యుపీలో 1,936 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని డిగ్రీ కళాశాలల్లో 1,936 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూపీఈఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నవంబర్ 19, 20 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.