నకిలీ వీడియోలతో కాంగ్రెస్ విష ప్రచారం: జైరాం రమేష్ క్షమాపణ చెప్పాలని అప్పలనాయుడు డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
నకిలీ వార్తలను సృష్టించి సమాజంలో గందరగోళం రేపడమే కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిందని విజయనగరం ఎంపీ, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మదనపల్లి హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవంలో రైతులు సంతోషం వ్యక్తంచేస్తే... యువత కేంద్రమంత్రిని అడ్డుకున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ వీడియోను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు.