అమెరికా మీడియాపై ప్రతీకారంగా సొంతంగా ట్రంప్ టీవీ ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమెరికా

అమెరికా మీడియా సంస్థలతో తీవ్ర ఘర్షణ నేపథ్యంలో వైట్ హౌస్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎన్‌ఎన్, ఎంఎస్‌నౌ, పాలిటికో వంటి ప్రముఖ ఛానెళ్లకు వైట్ హౌస్‌లో ప్రవేశం నిషేధించిన క్రమంలో, 24/7 ప్రసారాలతో అధికారికంగా ట్రంప్ టీవీ డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. మీడియా పక్షపాత ధోరణిని ఎండగడుతూ అధ్యక్షుడి కార్యకలాపాలను ఇకపై ఈ ప్రత్యేక ఛానెల్ ద్వారా ప్రసారం చేయనున్నారు.