జగనన్న కాలనీల్లో రూ.46 కోట్ల ప్రజాధనం బూడిదలో పన్నీరు!

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరంలలోని జగనన్న కాలనీలు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పనికిరాని మొక్కలతో నిర్మానుష్యంగా మారి, రూ.46.68 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా వృథా అయ్యాయి. సుమారు 70 శాతం ఇళ్ల నిర్మాణాలు జరిగినా లబ్ధిదారులు రావట్లేదని, మౌలిక వసతులు కల్పించకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.