కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ చూస్తే నాకు అసూయ వేస్తోందన్న మణిరత్నం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చెన్నై
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభను, టేకింగ్‌ను చూస్తే తనకు అసూయగా అనిపిస్తోందని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రశంసించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డోరతిపై విడుదలైన ప్రత్యేక వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా భాష, కెమెరా వినియోగంపై కార్తీక్‌కు ఉన్న పట్టు అద్భుతమని మణిరత్నం కొనియాడారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజాను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.