దివ్యాంగుడైన జొమాటో డెలివరీ బాయ్కు షాక్: మెట్లు ఎక్కిన తర్వాత ఆర్డర్ రద్దు చేసిన కస్టమర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

దివ్యాంగుడైన జొమాటో డెలివరీ ఏజెంట్ నిహిర్ రైడర్ కష్టపడి మెట్లు ఎక్కి వెళ్లిన తర్వాత కస్టమర్ ఆర్డర్ను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. భవనంలో లిఫ్ట్ లేకపోవడంతో తాను పడిన ఇబ్బందిని వివరించినా, కస్టమర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆర్డర్ క్యాన్సల్ చేశారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఇన్స్టాగ్రామ్లో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కస్టమర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.