మేడ్చల్ మల్కాజిగిరిలో బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

రిపోర్టర్: అశోక్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బిల్డర్ సెల్ కన్వీనర్ జి. పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలకు సేవలందించారు.