పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నల్లగొండ
నల్లగొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టేషన్ రికార్డులు, సీసీ కెమెరాలు, రిసెప్షన్‌ను పరిశీలించి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాము, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు.