వైసీపీ కుల రాజకీయాలపై తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లాలో ఒకే కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయదలుచుకున్నారా అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ను ఆ పార్టీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్రంగా ప్రశ్నించారు. మంగళవారం ఆమదాలవలసలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేక నిలువునా ముంచేయాలని భావిస్తున్నారా? అంటూ ధర్మాన కృష్ణదాస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కీలక ఆరోపణలు గుప్పించారు.