విజయవాడలో వైభవంగా మెగా కార్నివాల్: హాజరుకానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మంగళవారం నాడు అత్యంత వైభవంగా మెగా కార్నివాల్ నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రూపొందించిన ఈ అద్భుతమైన కార్నివాల్ను విజయవాడ నగర ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి తిలకించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.