రష్యాతో డీజిల్ దిగుమతి ఒప్పందాన్ని సమర్థించుకున్న అమెరికా ట్రెజరీ సెక్రటరీ

రిపోర్టర్: సతీష్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో కుదుర్చుకున్న డీజిల్ సరఫరా ఒప్పందాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గట్టిగా సమర్థించారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు తమ వద్ద తగిన చట్టపరమైన అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అమెరికన్లకు తక్కువ ధరకే డీజిల్ అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.