వైఎస్ జగన్ ను కలిసిన జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎస్. మధు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎస్. మధు బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న క్రైస్తవుల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. క్రైస్తవులకు ఎటువంటి అన్యాయం జరగకుండా పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు నేతలు తెలిపారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ బి. జాన్ వెస్లీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.