కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ హత్యపై సిట్ సంచలనం
రిపోర్టర్: సురేష్
స్థలం: Andhra Pradesh
కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలు పెట్టి హత్య చేశారని సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాణిగారి తోటలోని పాడుబడ్డ భవనంలో దారుణ హింసతో మే 12న సాయికృష్ణ మృతి చెందాడు. అర్ధరాత్రి మోటార్ సైకిల్ పై భౌతికకాయాన్ని స్మశానానికి తరలించి సీఐ నాగరాజు సమక్షంలో దహనం చేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు.