'బీహార్ నుంచి వచ్చి తెలంగాణను దోచుకున్నారు': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీలో భూ రికార్డులపై జరిగిన చర్చ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం బీహార్ నుంచి వచ్చి నిజాం కాలం నాటి సంపదను, పేదలకు దక్కాల్సిన భూములను దోచుకోవాలని చూసిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములలపై విచారణకు ఆదేశించామని, అక్రమంగా ఆక్రమించుకున్న ప్రతి అంగుళాన్ని వెలికితీస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.